విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ వసతి గృహాల్లో 68కిపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వినయ్ చంద్, ప్రాంతీయ కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ పి.వి. సుధాకర్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్. సూర్యనారాయణ సహా అధికారుల బృందం యూనివర్సిటీ హాస్టళ్లను సందర్శించింది. విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు.
ఆంధ్ర యూనివర్సిటీలో కరోనా కలవరం.. యంత్రాంగం అప్రమత్తం
ఏపీలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 68 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వైద్యాధికారుల బృందంతో కలిసి వసతి గృహాలను సందర్శించారు. ఇప్పటివరకు బయటపడిన కేసుల్లో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవని కలెక్టర్ చెప్పారు.
ఇప్పటివరకు బయటపడిన పాజిటివ్ కేసుల్లో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని అన్నారు. విద్యార్థులకు అవసరమైన చికిత్స అందిస్తున్నామని వివరించారు. వసతి గృహాల్లో ఉండటం వల్ల వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందిందని.. ఇంజినీరింగ్ బాలుర వసతి గృహాల్లోనే హోం క్వారంటైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్ధుల తల్లిదండ్రులకూ సమాచారం ఇచ్చామని.. ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్