తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణలో ప్రస్తుతం 34 ఐపీఎస్​ పోస్టులు ఖాళీ'

తెలంగాణకు 2020 జనవరి 1 నాటికి 139 ఐపీఎస్ పోస్టులు కేటాయించగా.. ప్రస్తుతం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. లోక్​సభలో తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

34 ips posts are vacant in telangana
తెలంగాణలో ప్రస్తుతం 34 ఐపీఎస్​ పోస్టులు ఖాళీ

By

Published : Mar 10, 2021, 10:34 AM IST

తెలంగాణకు ఐపీఎస్ పోస్టుల కేటాయింపుపై పార్లమెంట్​లో తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి 2020 జనవరి 1 నాటికి 139 ఐపీఎస్​ పోస్టులు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. పదవీ విరమణ, రాజీనామాలు, మరణాలు, ఉద్యోగాల నుంచి తొలగింపులే ఖాళీలకు కారణమని చెప్పారు. ఐపీఎస్​ల కొరతను నివారించడానికి ఏటా బ్యాచ్​ సంఖ్యను పెంచుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

2005లో సివిల్స్ పరీక్షల ద్వారా నియమించే ఐపీఎస్​ల సంఖ్యను 88 నుంచి 103కి, 2008-130, 2009-150, 2020-200కి పెంచినట్లు నిత్యానందరాయ్ వివరించారు. 2019లో తెలంగాణ కేడర్​కు ఐదుగురు ఐపీఎస్​ అధికారులను కేటాయించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details