నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ యోగిత రానా పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఓల గ్రామంలోని వైకుంఠ దామాన్ని పరిశీలించారు.
'అధికారులు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పనులు చేయాలి' - వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ యోగిత రానా తాజా వార్తలు
పల్లెప్రగతి కార్యక్రమంలో అనుకున్న పనులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ యోగిత రానా పరిశీలించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో పర్యటించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ యోగిత రానా
గ్రామంలోని మహిళ సంఘాలతో మాట్లాడారు. చెత్త బుట్టలు, మెక్కల పంపిణి గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో అనుకున్న పనులపై ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'