Banks Offers Home Loan on Lower Interest Rates : సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరికి స్వప్నం. ఈ కల వాస్తవ రూపం దాల్చడానికి అందరికీ ఎదురయ్యే మొదటి ఇబ్బంది డబ్బు సర్దుబాటు. ఇలాంటి వారికోసమే.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు గృహ రుణాలు అందిస్తుంటాయి. అనివార్య పరిస్థితుల్లో చాలా మంది గృహ రుణాలు తీసుకుంటున్నారు. మరి, అతి తక్కువ వడ్డీ రేట్లతో.. హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఏవో..? ఎంత మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నాయో మీకు తెలుసా??
తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ అందిస్తున్న బ్యాంకులివే..
These Banks are Providing Home Loans at Low Interest Rates :
HDFC : ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు.. హెచ్డీఎఫ్సీ(HDFC) తమ వినియోగదారులలో హోమ్ లోన్స్ కావాలనుకునే అర్హులైన రుణగ్రహీతలకు చాలా తక్కువ వడ్డీరేటుతో గృహ రుణాలు ఇస్తోంది. ఈ బ్యాంకులో హోమ్ లోన్లపై కనీస వడ్డీరేటు 8.5శాతంగా ఉండగా.. గరిష్ఠంగా 9.85శాతం వరకు ఉంది. అదనంగా ఈ లోన్ల కోసం అనుబంధిత ప్రాసెసింగ్ ఫీజులు గరిష్ఠంగా 3వేల నుంచి 5వేల వరకు ఉన్నాయి. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి హెచ్డీఎఫ్సీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోందనేది నిపుణుల అభిప్రాయం.
ఇండస్ఇండ్ బ్యాంకు :ఇండస్ఇండ్ బ్యాంకు(Indusind Bank) హోమ్ లోన్స్‌పై 8.5% నుంచి 9.75% వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పొడిగించిన రీపేమెంట్ కాలపరిమితి.. వినియోగదారులకు మంచ ఆప్షన్ గా ఉంది.
ఇండియన్ బ్యాంకు :పైన పేర్కొన్న బ్యాంకుల మాదిరిగానే ఇండియన్ బ్యాంకు(Indian Bank)కూడా ఆర్షణీయమైన గృహ రుణాలను అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో హోమ్ లోన్స్‌పై ప్రారంభ వడ్డీ రేటు 8.5% ఉండగా.. గరిష్ఠ వడ్డీ రేటు 9.9%గా ఉంది.-పేమెంట్ నిబంధనలను కూడా సౌకర్యవంతంగానే ఉంటాయి.