Upcoming Cars Under 15 Lakhs India 2023 :దేశంలో ఎక్కువగా ఉన్న మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని.. వారికి అందుబాటులో ధరలు ఉండేలా కార్లను రూపొందిస్తున్నాయి పలు కంపెనీలు. కొత్త మోడల్ కార్లను ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరల్లో తీసుకువస్తున్నాయి. ఇలాంటి కార్లనే 2023 ముగిసేనాటికి మర్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి కంపెనీలు. రూ.15 లక్షల లోపే వీటి ధరలను నిర్ణయించాయి తయారీ సంస్థలు. రాబోయే రోజుల్లో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ , టయోటా రూమియన్ ఇంకా మరికొన్ని కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్..
Tata Nexon Facelift Price :నెక్సాన్ కారుకు లోపల, బయట కొన్ని మార్పులు చేసి.. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువచ్చింది కంపెనీ. 2023 ఆటో ఎక్స్‌పోలో ఈ కారును టాటా కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ల సామర్థ్యంతో తయారు చేసింది కంపెనీ. ఐదు గేర్ల మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యం ఈ కారులో ఉంటుంది.
టయోటా రూమియన్..
Toyota Rumion Launch Date :టయోటా రూమియన్ ధర దాదాపు రూ.9 లక్షల నుంచి రూ.13 లక్షల మధ్యలో ఉంటుంది. టయోటా రూమియన్‌ను మారుతి సుజుకి రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
1.5 లీటర్లు, నాలుగు సిలిండర్ల మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో సామర్థ్యంతో.. ఈ కారును తయారు చేసింది టయోటా కంపెనీ. ఆటో, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. సీఎన్జీ వేరియెంట్ కూడా ఈ మోడల్లో అందుబాటులో ఉంది.
హోండా ఎలివేట్..
Honda Elevate Price in India 2023 :దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. కచ్చితమైన ధరలు మాత్రం సెప్టెంబర్ 4న వెల్లడి కావచ్చు. 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ సామర్థంతో ఈ హోండా ఎలివేట్ కారును తయారు చేసింది సంస్థ. ఇందులో ఆరు గేర్ల ఆటో ట్రాన్స్మిషన్, కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ గేర్ల సౌకర్యం ఉంటుంది.