Stock Markets: దేశీయ మార్కెట్లపై బేర్ పంజా విసిరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ద్రవ్యోల్బణం భయాలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. బ్యాంకింగ్, మెటల్, ఐటీ వంటి కీలక రంగాల్లో అమ్మకాలతో దేశీయ సూచీలు ఈ వారాంతాన్ని భారీ నష్టాల్లో ముగించాయి. ఐపీఓకు వచ్చిన తొలి రోజు నుంచే ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఎల్ఐసీ.. మరింత పతనమైంది. సెన్సెక్స్.. 1000 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 250కిపైగా పాయింట్ల నష్టంతో ముగిసింది.
ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1017 పాయింట్ల నష్టంతో 54,303 వద్ద ముగిసింది
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 276 పాయింట్లు కోల్పోయి 16,202 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి..
ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్ లాభాల్లో ముగిశాయి. మరోవైపు.. కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, విప్రో 3 శాతానికిపైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.