తెలంగాణ

telangana

ETV Bharat / business

Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్​ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బులు డబుల్​!

Kisan Vikas Patra Scheme Details In Telugu : మీరు మంచి ఆదాయం వచ్చే పథకంలో పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? ఏ మాత్రం రిస్క్​లేని స్కీమ్​లో ఇన్వెస్ట్ చేద్దామని నిశ్చయించుకున్నారా? అయితే ఇది మీ కోసమే. 'కిసాన్ వికాస్​ పత్ర' పేరుతో పోస్ట్​ ఆఫీస్​ పథకం ఒకటి ఉంది. దీనిలో మీరు ఇన్వెస్ట్​ చేస్తే.. మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. మరి స్కీమ్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా?

post office scheme Kisan Vikas Patra
Kisan Vikas Patra scheme

By

Published : Aug 1, 2023, 1:30 PM IST

Kisan Vikas Patra Scheme : ప్రజలు తమ పెట్టుబడులను రెట్టింపు చేసే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని తపిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పోస్ట్​ ఆఫీస్​ స్కీమ్​లను ప్రవేశపెట్టింది. వాటిలో ప్రధానమైనది 'కిసాన్ వికాస్​ పత్ర' స్కీమ్​. ఇదిప్రభుత్వ పథకం కనుక మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. పైగా రిటర్నులు కూడా గ్యారెంటీగా వస్తాయి.

మీ డబ్బు రెట్టింపు అవుతుంది!
Kisan Vikas Patra Scheme Interest Rate : కిసాన్ వికాస్​ పత్ర పథకాన్ని 1988లోనే ప్రారంభించారు. 'ప్రజలలో దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడమే' లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్​ 1న ఈ కిసాన్​ వికాస్​ పత్ర పథకంపై ఇచ్చే వడ్డీ రేట్లును పెంచడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేసినవారికి సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ చొప్పున అందుతుంది. దీని వల్ల కేవలం 115 నెలలు లేదా 9 సంవత్సరాల 7 నెలలోనే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మీరు రూ.4 లక్షలు ఈ కిసాన్ వికాస్​ పత్ర పథకంలో పెట్టుబడి పెడితే.. 115 నెలల్లో మీకు రూ.8 లక్షలు అందుతాయి. గతంలో కిసాన్​ వికాస్​ పత్ర స్కీమ్​లోని డబ్బులు రెట్టింపు కావడానికి 120 నెలలు పట్టేది. అంటే మీ పెట్టుబడి రెట్టింపు కావడానికి కనీసం 10 సంవత్సరాలు వేచిచూడాల్సి వచ్చేది.

రైతులకు మాత్రమే కాదు..!
KVP Scheme 2023 :కిసాన్ వికాస్​ పత్ర స్కీమ్​లో కనిష్ఠంగా రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. అదే సమయంలో గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఒక వేళ మీరు రూ.50,000 లేదా అంత కంటే ఎక్కువ మొత్తాన్ని ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలంటే.. కచ్చితంగా మీ పాన్​ కార్డ్​ వివరాలు అందించాలి. ప్రధానంగా మనీలాండరింగ్ కేసులను నివారించేందుకు దీనిని తప్పనిసరి చేశారు.

ఒక వేళ మీరు రూ.10 లక్షలు అంత కంటే ఎక్కువ మొత్తాన్ని కిసాన్​ వికాస్​ పత్ర స్కీమ్​లో పెట్టుబడి పెట్టాలంటే.. మీ ఇన్​కం ప్రూఫ్​లను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ శాలరీ స్లిప్స్​, బ్యాంక్​ స్టేట్​మెంట్స్​, ఐటీఆర్​ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. మొదట్లో ఈ కిసాన్​ వికాస్ పత్ర పథకాన్ని కేవలం రైతులు కోసం మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ నేడు అర్హులైన పౌరులందరికీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టు ఆఫీసుల్లో అందుబాటులో ఉంది.

అర్హతలు ఏమిటి?
Kisan Vikas Patra Scheme Eligibility : ఈ కిసాన్ వికాస్​ పత్ర పథకంలో మదుపు చేయాలంటే.. దరఖాస్తుదారు కచ్చితంగా భారతీయ పౌరుడు అయ్యుండాలి. అలాగే 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అలాగే ఈ పథకంలో మైనర్​ పిల్లల పేరుతో తల్లిదండ్రులు గానీ, గార్డియన్ గానీ ఇన్వెస్ట్​ చేయవచ్చు. కానీ హిందూ అవిభాజ్య కుటుంబం (HUF), ప్రవాస భారతీయులు (NRI) ఈ పథకంలో చేరడానికి అనర్హులు.

ABOUT THE AUTHOR

...view details