Income Tax Saving Tips : సంవత్సరానికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపన్ను చెల్లించాల్సిందే. అయితే సరిగ్గా ప్లాన్ చేస్తే, ఈ ఇన్‌కం టాక్స్‌ను భారీ మొత్తంలో తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని పలు సెక్షన్లు కొన్ని రకాల పొదుపులు,పెట్టుబడులపై పన్ను మినహాయింపులు కల్పిస్తాయి. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చులపై కూడా పన్ను తగ్గింపులను అందిస్తాయి. ఈ మార్గాలను సక్రమంగా ఉపయోగించుకుంటే, కచ్చితంగా చాలా వరకు ఆదాయ పన్నును తగ్గించుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఇన్‌కం టాక్స్‌ను తగ్గించే టాప్-5 మార్గాల గురించి తెలుసుకుందాం.
1. ఇంటి రుణం తీసుకోవాలి
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(C), 24(b) ప్రకారం, గృహ రుణం చెల్లింపులకు ప్రత్యేకమైన పన్ను మినహాయింపులు లభిస్తాయి. 80(C) ప్రకారం ప్రిన్సిపల్ మెుత్తం చెల్లింపులో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే విధంగా 24(b) ప్రకారం వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.
2. హెల్త్ ఇన్సూరెన్స్
సెక్షన్ 80(D) ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్‌కు కోసం చేసే ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపులు ఉంటాయి. బీమా తీసుకున్న వారి వయస్సు ఆధారంగా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
3. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పెట్టుబడి
సెక్షన్ 80( C) ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకాలలో పొదుపు చేయటం ద్వారా రూ.1.5 లక్షల వరకూ ఇన్‌కం టాక్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్, పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్లలో పెట్టిన పెట్టుబడులకు ఈ ఆదాయ పన్ను మినహాయింపులు లభిస్తాయి. పైగా వీటికి పెద్ద మొత్తంలో వడ్డీ కూడా లభిస్తుంది.