Home Loan Subsidy Schemes :చాలా మందికి కొత్త ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అందుకు సరిపడా సొమ్ములేక కాస్త వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా సాయం చేస్తోంది. పండగ సీజన్లో తక్కువ వడ్డీ రేట్లతో లోన్ ఇస్తోంది. పైగా సబ్సిడీలు కూడా అందిస్తోంది. ఆ పథకాలేంటి, ఎంత మేరకు రాయితీ పొందవచ్చు? ఏ మేరకు లోన్ తీసుకోవచ్చు? తదితర వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన..
Pradhan Mantri Awas Yojana (PMAY) :ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు(EWS), తక్కువ, మధ్య స్థాయి ఆదాయ వర్గాలవారికి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద హోమ్‌లోన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటు లబ్ధిదారుల ఆదాయాన్ని అనుసరించి 6.5 శాతం వరకు సబ్సిడీలు కూడా ఇస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 20 ఏళ్ల కాలవ్యవధితో రూ.50 లక్షల వరకు ఈ గృహ రుణాన్ని పొందవచ్చు.
క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్..
Credit Linked Subsidy Scheme (CLSS) :ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇదొక భాగం. తక్కువ ఆదాయ వర్గాలకు ఈ స్కీం ద్వారా లోన్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. 20 ఏళ్ల కాలవ్యవధితో ఈ స్కీంలో లోన్ తీసుకోవచ్చు. ఇందులో కూడా 6.5 శాతం వరకు సబ్సిడీలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు..
Stamp duty and registration fee waiver :ఈ పండగ సీజన్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గృహ రుణాలపై.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై మినహాయింపులను అందిస్తున్నాయి.