Gram Suraksha Postal Scheme Details : పోస్ట్ ఆఫీసుల్లో లాభాలు తక్కువగా ఉన్నా.. ఎక్కువ మంది పొదుపు చేయడానికి ముందడుగేస్తారు. ఎందుకంటే.. గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వంటివి.. కొంచెం రిస్క్‌తో కూడుకున్నవి కాబట్టి. అందుకే.. పోస్టాఫీస్ వైపు చూస్తారు. ఇలా.. చిన్నమొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకోసం ఒక మంచి పొదుపు పథకం ఉంది. అదే.. "గ్రామ సురక్ష యోజన". దీనిలో పెట్టుబడి పెట్టి మెచ్యూరిటీ పీరియడ్ తరవాత లక్షల రూపాయలను మీ సొంతం చేసుకోవచ్చు. మరి, ఈ పథకంలో ఎలా చేరాలి..? ఎవరు అర్హులు..? ఎంత పెట్టుబడి పెట్టాలి..? అనే వివరాలను తెలుసుకుందాం.
Gram Suraksha Postal Scheme : ఏమిటీ గ్రామ సురక్ష యోజన స్కీమ్..?
గ్రామ సురక్ష యోజన పథకం అనేది.. గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్‌లో ఒక భాగం. దీనిని దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం 1995లో తపాలా శాఖ ప్రారంభించింది. దీనిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి వయస్సు 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ స్కీమ్‌లో రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. స్కీమ్‌కు సంబంధించి ప్రీమియం చెల్లించడానికి వివిధ ఆప్షన్లు ఉన్నాయి. అవి నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ సంవత్సరంగా చెల్లించవచ్చు.
Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?
Gram Suraksha Postal Scheme Details In Telugu :నెలకు ఎంత చెల్లించాలి ?
గ్రామ సురక్ష యోజన స్కీమ్‌లో చేరిన వ్యక్తి నెలకు రూ.1,515లను పొదుపు చేయాలి. అంటే రోజుకు 50 రూపాయలు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీరు తిరిగి రూ.35 లక్షల వరకు రాబడిని పొందవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 ఏళ్ల వయస్సులో గ్రామ సురక్ష పథకంలో చేరితే.. అతను 55 ఏళ్ల వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాలి. అతను 58 సంవత్సరాల వరకు ఈ స్కీమ్‌లో నమోదు చేసుకుంటే.. అప్పుడు నెలకు రూ.1,463 లను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అతను 60 సంవత్సరాల వరకు స్కీమ్‌లో ఉంటే నెలకు రూ.1,411 లను చెల్లించాలి. ప్రీమియం సకాలంలో చెల్లించకపోతే దానిని 30 రోజుల్లోపు డిపాజిట్ చేయవచ్చు.
రాబడి ఎలా ఉంటుంది ?
మీరు స్కీమ్‌లో ఎన్ని సంవత్సరాలు పొదుపు చేశారు.. అనే దాని బట్టి మీకు రాబడి వస్తుంది. 55 ఏళ్ల వరకు స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీకు రూ.31,60 లక్షలు తిరిగి వస్తాయి. అదే 58 ఏళ్లకు 33.40 లక్షలు, 60 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడి పెడితే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి. గ్రామ సురక్ష యోజన స్కీమ్ కింద 80 ఏళ్లు నిండిన వ్యక్తికి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే.. ఈ మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టపరమైన వారసులకు లేదా నామినీకి అందిస్తారు. ఈ స్కీమ్‌ను ప్రారంభించిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు స్వచ్ఛందంగా పథకాన్ని నిలిపేయవచ్చు. కానీ, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పాలసీలో అతిపెద్ద హైలైట్ తపాలా శాఖ అందించే బోనస్. చివరిగా తపాలా శాఖ ప్రకటించిన బోనస్‌లో ప్రతి రూ. 1,000కి సంవత్సరానికి రూ.60 లను బోనస్‌గా అందించింది.
Best 5 Saving Schemes for Senior Citizens : వృద్ధాప్యంలో లాభాలు తెచ్చే.. సూపర్ సేవింగ్ స్కీమ్స్ ఇవే!
Best Post Office Saving Schemes for Boy Child : మగ పిల్లల కోసం.. పోస్టాఫీస్ 5 పొదుపు పథకాలు.. మీకు తెలుసా?