తెలంగాణ

telangana

ETV Bharat / business

సుందర్​ పిచాయ్​కు బిగ్ షాక్.. రోబో చేసిన చిన్న మిస్టేక్​తో 100 బిలియన్ డాలర్లు నష్టం

గూగుల్ ఇటీవల రూపొందించిన కొత్త ఏఐ చాట్​బాట్​ 'బార్డ్' కొంపముంచింది. అది చేసిన ఓ చిన్న తప్పిదం వల్ల గూగుల్ మాతృసంస్థకు దాదాపు 100 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. అసలేం జరిగిందంటే..?

Google lost $100b after its AI made a factual error in a demo
కొంపముంచిన గూగుల్ కొత్త ఏఐ ఛాట్​బాట్ బార్డ్

By

Published : Feb 9, 2023, 3:42 PM IST

చాట్​జీపీటీకి పోటీగా గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ చాట్​బాట్ బార్డ్ ఆ సంస్థను చిక్కుల్లో పడేసింది. అది చేసిన ఓ తప్పిదం.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​కు సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. గూగుల్.. ప్రయోగాత్మక దశలో ఉన్న బార్డ్​ ఏఐ సర్వీస్​ను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియోలో ఈ బార్డ్ తప్పుడు సమాచారం ఇచ్చింది.

సౌర వ్యవస్థకు అవతల ఉన్న గ్రహాన్ని గుర్తించి ఫొటోలు తీసిన తొలి శాటిలైట్ ఏంటనే విషయంపై గూగుల్ చాట్​బాట్ బార్డ్​ తప్పుడు జవాబు చెప్పింది. గూగుల్ ఏఐ చాట్​బాట్ బార్డ్.. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మొట్టమొదటి చిత్రాన్ని తీసిందని సమాధానం ఇచ్చింది. అయితే ఈ జేమ్స్ వెబ్​ స్పేస్​ను ఇటీవలే 2021లో ప్రయోగించారు. ప్యారిస్​లో బార్డ్ లాంచ్ ఈవెంట్​కు కొన్ని గంటల ముందు రాయిటర్స్ ఏజెన్సీ ఈ తప్పును గుర్తించింది. దీనివల్ల బార్డ్ పనితీరుపై అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అల్ఫాబెట్​ షేర్లు 9శాతం పడిపోయి.. గూగుల్ మాతృసంస్థ భారీగా నష్టపోయింది.

ABOUT THE AUTHOR

...view details