Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారంపై దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దేశంలో పసిడి దిగుమతులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కరెంట్ ఖాతా లోటును అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఒక్కసారిగా పుత్తడి ధర రూ. 1000 మేర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.53,450 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.1500 మేర తగ్గి రూ. 59,400కు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,450గా ఉంది. కిలో వెండి ధర రూ.59,400 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,450గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,400గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,450గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,400 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,450గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,400 వద్ద కొనసాగుతోంది.
గురువారం వరకు పుత్తడిపై ప్రాథమిక దిగుమతి సుంకం 7.5 శాతంగా ఉండగా.. తాజా పెంపుతో అది 12.5 శాతానికి చేరింది. దీనికి 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అదనం. దీంతో బంగారంపై దిగుమతి పన్ను 15 శాతానికి చేరింది. ఈ మొత్తానికి 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పెరిగిన దిగుమతి సుంకంతో రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1786 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.64 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.