Bank Holidays In November 2023 :బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 నవంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను షెడ్యూల్ చేసుకోవడం మంచిది. లేదంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆర్బీఐ ప్రతి నెలా.. బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా నవంబర్ నెలలోని సెలవుల జాబితాను కూడా ఇటీవలే విడుదల చేసింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందుకే ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2023 నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా
List of Bank Holidays In November 2023 :
- నవంబర్ 1 (బుధవారం) : బెంగళూరు, ఇంఫాల్, సిమ్లాల్లోని బ్యాంకులకు సెలవు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఈ రోజున కన్నడ రాజ్యోత్సవం/ కుట్/ కర్వా చౌత్ పర్వదినాలు జరుగుతాయి.)
- నవంబర్ 5 (ఆదివారం)
- నవంబర్ 10 ( శుక్రవారం) : గోవర్థన పూజ/ లక్ష్మీపూజ/ దీపావళి పండుగ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 11 (రెండో శనివారం)
- నవంబర్ 12 (ఆదివారం)
- నవంబర్ 13 (సోమవారం) :గోవర్ధన్ పూజ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, దిల్లీలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 14 (మంగళవారం) : దీపావళి (బలి ప్రతిపాద)/ విక్రమ సంవత్/ లక్ష్మీ పూజ సందర్భంగా.. అహ్మదాబాద్, బేలాపుర్, బెంగళూరు, గ్యాంగ్టక్, ముంబయి, నాగ్పుర్ల్లోని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 15 (బుధవారం) : భాయ్ దూజ్/ చిత్రగుప్త జయంతి సందర్భంగా గ్యాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ, సిమ్లాల్లోని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 19 (ఆదివారం)
- నవంబర్ 20 (సోమవారం) : ఛత్ పండుగ సందర్భంగా పట్నా, రాంచీల్లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 23 (గురువారం) : సెంగ్ కుట్ స్నెమ్/ ఇగాస్ బగ్వాల్ పండుగల సందర్భంగా దేహ్రాదూన్, షిల్లాంగ్ల్లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 24 (శుక్రవారం) : లచిత్ దివాస్ (అసోంలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 25 (నాలుగో శనివారం)
- నవంబర్ 26 (ఆదివారం)
- నవంబర్ 27 (సోమవారం) : గురునానక్ జయంతి/ కార్తీక పూర్ణిమ సందర్భంగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్టక్, గువాహటి, హైదరాబాద్, ఇంఫాల్, కోచి, పనాజీ, పట్నా, త్రివేండ్రం, షిల్లాంగ్ల్లోని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 30 (గురువారం) : కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలోని బ్యాంకులకు సెలవు.