అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 152 పాయింట్ల కోల్పోయి 41,170 పాయింట్ల వద్ద స్థిరపడింది.
45 పాయింట్లు నష్టపోయిన జాతీయ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 12,080 పాయింట్లకు చేరుకుంది.
కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారని ట్రేడర్లు భావిస్తున్నారు. కరోనా కారణంగా దెబ్బతిన్న కంపెనీలకు రుణాల చెల్లింపును సులభం చేసేందుకు వడ్డీరేట్లను తగ్గించింది చైనా కేంద్ర బ్యాంకు. ఫలితంగా షాంఘై కాంపొజిట్ దూసుకెళ్లింది.