లాభాల్లో మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 422 పాయింట్లకు పైగా బలపడి 58,230 వద్ద ట్రేడవుతుంది. మరో సూచీ నిప్టీ 130 పాయింట్ల లాభంతో 17,396 వద్ద కొనసాగుతోంది.
అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం సహా టెక్ స్టాక్‌లు తిరిగి కోలుకున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నేడు లాభాల్లో పయనిస్తున్నాయి. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
మరోవైపు గురువారం ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. అలాగే అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు రానున్నాయి. ఈ రెండు ప్రధాన పరిణామాలపైన మదుపర్లు దృష్టి సారించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు గురువారం వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ కూడా నేడు సూచీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
లాభనష్టాలు..
ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్ర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.