తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐఎంఎఫ్​ వృద్ధి రేటు అంచనాలతో మార్కెట్లకు నష్టాలు

స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో భారత వృద్ధిరేటు తగ్గిపోనుందన్న ఐఎంఎఫ్​ అంచనాల నేపథ్యంలో మదుపరుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. సెన్సెక్స్​ 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 11 వేల 300 దిగువకు చేరింది.

స్టాక్​మార్కెట్లకు నష్టాలు

By

Published : Jul 24, 2019, 9:57 AM IST

Updated : Jul 24, 2019, 10:13 AM IST

స్టాక్​మార్కెట్లను నష్టాలు వీడట్లేదు. సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా.. ఆరంభ ట్రేడింగ్​ లాభాలు ఆవిరయ్యాయి. స్వల్ప లాభాల అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి. సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఒక్కసారిగా ఒత్తిడికి లోనై నష్టాల బాట పట్టాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్​) వచ్చే రెండేళ్లలో భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది. 2019, 20 ఆర్థిక సంవత్సరాల్లో ముందు ప్రకటించిన వృద్ధిరేటు కన్నా 0.3 శాతం తక్కువగా నమోదు కానుందని పేర్కొంది. ఇది మదుపరుల మనోభావాలపై ప్రభావం చూపించింది. విదేశీ నిధులు భారీగా తరలి వెళ్లటం నష్టాలకు దారితీసింది. ఆటో, లోహ, విద్యుత్తు, ఫార్మా, ఐటీ, ఇన్​ఫ్రా రంగాలన్నీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. కొనుగోళ్లు మందగించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 113 పాయింట్లు క్షీణించింది. చివరి సెషన్​లోనే 38 వేల మార్కును కోల్పోయిన సెన్సెక్స్.. ​నేడు మరింత పతనమైంది. ఒకానొక దశలో 38 వేల పాయింట్లను అధిగమించిన సూచీ.. ప్రస్తుతం 37 వేల 869 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 11 వేల 300 మార్కు కోల్పోయింది. ప్రస్తుతం 52 పాయింట్లు కోల్పోయి 11 వేల 279 వద్ద ఉంది.

లాభనష్టాల్లోనివి...

హెచ్​డీఎఫ్​సీ, యస్​ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, టోరెంట్​ ఫార్మా, జీ ఎంటర్​టైన్​మెంట్​, టెక్​ మహీంద్రా, ఎల్​ అండ్​ టీ, హెచ్​యూఎల్​, ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, టాటా స్టీల్​ లాభాలు నమోదు చేశాయి.

వేదాంత, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, మారుతీ సుజుకీ, సిప్లా, బీపీసీఎల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్​, ఎం అండ్​ ఎం నష్టాల బాట పట్టాయి.

రూపాయి మారకం..

రూపాయి ఆరంభ ట్రేడింగ్​లో స్వల్పంగా 15 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 68.94 వద్ద ఉంది.

Last Updated : Jul 24, 2019, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details