తెలంగాణ

telangana

ETV Bharat / business

మదుపరుల జాగ్రత్త... మందకొడిగా మార్కెట్లు

ఆర్థిక సర్వే, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక డేటా విడుదలకానున్న నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు మందకొడిగా సాగుతున్నాయి.

మదుపరుల జాగ్రత్త... మందకొడిగా మార్కెట్లు

By

Published : Feb 12, 2019, 11:54 AM IST

స్టాక్​మార్కెట్లు మందకొడిగా సాగుతున్నాయి. ఆర్థిక సర్వే రానున్న నేపథ్యంలో విదేశీ-దేశీయ పెట్టుబడిదారులు జాగ్రత్తపడ్డారు.

డిసెంబర్​ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక(ఐఐపీ) డేటా, జనవరి నెల ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమయ్యారు.

సెన్సెక్స్​ 36 పాయింట్ల స్వల్ప నష్టంతో 36వేల 358 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 15 పాయిట్ల పతనమై 10వేల 873 వద్ద ట్రేడవుతోంది.

లాభాలు-నష్టాలు...

ఇన్ఫోసిస్​, టీసీఎస్​, హీరో మోటో కార్ప్​, హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఆటో సంస్థలు నష్టపోయాయి.

పవర్​గ్రిడ్​, యస్​ బ్యాంక్​, సన్​ ఫార్మా, వేదాంత, ఓఎన్​జీసీ, టాటా స్టీల్​, ఎస్​బీఐ సంస్థలు లాభపడ్డాయి.

బలపడిన రూపాయి...

వరుసగా ఆరోరోజు రూపాయి బలపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 71.18 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details