తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​పై అంచనాలతో లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 120 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 37 పాయింట్ల వృద్ధిలో ట్రేడవుతోంది. కేంద్రం రేపు బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నందున మదుపురులు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.

బడ్జెట్​పై అంచనాలతో లాభాల్లో మార్కెట్లు

By

Published : Jul 4, 2019, 10:07 AM IST

రెండోసారి వరుసగా కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం రేపు బడ్జెట్​ ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్​పై సానుకూల అంచనాలతో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 120 పాయింట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం 39,960 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 11,954 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

లాభాల్లో..

ఇండియా బుల్స్​, యూపీఎల్, కోటక్​ మహీంద్ర, ఎస్​బీఐ ​ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో..

టాటా స్టీల్​, హెచ్​సీఎల్ టెక్​, బజాజ్​ ఆటో, జేఎస్​డబ్ల్యూ స్టీల్, టైటాన్​, విప్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి 9 పైసలు మెరుగైంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68.82 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 63.34 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details