టోకు ధరల ద్రవ్యోల్బణం గత నెలలో 2.93 శాతంగా నమోదైంది. ప్రభుత్వం ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం... గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో 0.19 శాతం పెరిగింది. గతేడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 2.74 శాతంగా ఉంది.
2.93శాతానికి టోకు ద్రవ్యోల్బణం - డబ్ల్యూపీఐ
టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో 2.93శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయంలో 2.76 శాతంగా నమోదైంది.
టోకు ద్రవ్యోల్బణం
ఆహార ఉత్పత్తులపై డబ్ల్యూపీఐ గతనెల 4.84శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 3.54 శాతంగా ఉంది.
ఇంధన, శక్తి ఉత్పాదక విభాగాలపై డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం గత నెల 2.23 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 3.54 శాతంగా ఉంది.