తెలంగాణ

telangana

ETV Bharat / business

సంవత్సరం చివరికి సెట్ టాప్​ బాక్స్​ పోర్టబిలిటీ! - సెటప్​బాక్స్​

సెట్​ టాప్​ బాక్స్​ పోర్టబిలిటీకి ఆచరించదగిన పరిష్కారాన్ని పరీక్షిస్తున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్)​ తెలిపింది. ఈ సంవత్సరం చివరికి ఇది అమలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది.

సంవత్సరం చివరికి సెటప్​బాక్స్​ పోర్టబిలిటీ!

By

Published : May 11, 2019, 6:50 AM IST

Updated : May 11, 2019, 7:06 AM IST

సంవత్సరం చివరి నాటికి సెట్​ టాప్​ బాక్స్​ పోర్టబిలిటీ అమలయ్యే అవకాశం ఉన్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్​) అంచనా వేస్తోంది. దీని కోసం ఆచరించదగిన పరిష్కారాన్ని పరీక్షిస్తున్నట్లు తెలిపింది ట్రాయ్.

వినియోగదారులు ప్రస్తుతం సెట్​ టాప్​ బాక్స్​ కొనుగోలు చేసినట్లయితే ఆపరేటర్​ మారటానికి అవకాశం లేదు. వేరే ఆపరేటర్​కు మారాలంటే మరో సెట్​ టాప్​ బాక్స్​ కొనుగోలు చేయాల్సిందే. దీనివల్ల పాతది నిరుపయోగంగా ఉండటంతో పాటు ఎలక్ట్రానిక్​ చెత్త పోగవుతోంది.

పోర్టబిలిటీ కోసం వివిధ భాగస్వామ్య సంస్థలు, పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తోంది ట్రాయ్​.

వర్క్​షాప్​...

గురువారం నాడు ట్రాయ్​ ఒక వర్క్​షాప్​ను నిర్వహించింది. దీనికి డీటీహెచ్​ ఆపరేటర్లు, మల్టీ సిస్టమ్​ ఆపరేటర్లు, సెట్​ టాప్​ బాక్స్​ తయారిదార్లు తదితరులు హాజరయ్యారు.

మొబైల్​ నంబర్​ పోర్టబిలిటీ నుంచి తెలుసుకున్న ఆనుభవాల దృష్ట్యా సెట్​ టాప్​ బాక్స్​ పోర్టబిలిటీ పోటీని పెంచుతుంది. ఇది దీర్ఘ కాలంలో పరిశ్రమకు మంచి చేస్తుంది. - ట్రాయ్​

ఇదీ చూడండి: భారీగా పెరగనున్న ఆన్​లైన్​ వీడియో వీక్షకులు

Last Updated : May 11, 2019, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details