2050 నాటికి జపాన్, జర్మనీని వెనక్కినెట్టి ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానానికి చేరుకోనున్నట్లు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాల్లో పని చేస్తున్న జనాభా, వారి వయసు, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆధారంగా ఈ పరిశోధన చేశారు.
2050కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! - lancet general report on indianeconomy
2050 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి చేరుకుంటుందని పేర్కొంది.
2017లో భారత్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ గణాంకాల ఆధారంగానే పరిశోధకులు తాజా అధ్యయనం చేశారు. 2030 నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, 2050 నాటికి ఇండియా 3వ స్థానానికి చేరుకుంటుందని అధ్యయనం తెలిపింది.
ప్రస్తుతం మొదటి రెండు స్థానాల్లో ఉన్న అమెరికా, చైనా 2050 నాటికి వాటి స్థానాలను నిలబెట్టుకుంటాయని పేర్కొంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పయనిస్తోంది. అనేక వ్యాపారాలు నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం క్షీణించింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం వెలువడటం గమనార్హం.