దేశ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి చేరడంపై కేంద్రాన్ని తప్పుబట్టింది కాంగ్రెస్. దీనిని మోదీనే కారణమని తెలిపింది.
జీడీపీ తిరోగమనానికి జాతీయ, అంతర్జాతీయ అంశాలే కారణమన్న ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రకటన సరికాదని తెలిపింది. జీడీపీ క్షీణతపై అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపవని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ గౌడ. '' కుంగిపోతున్న ఆర్థిక నావ.. పెరిగిపోతున్న కుంభకోణాల''పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
''జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి చేరింది. నోట్ల రద్దు, తొందరపాటు జీఎస్టీ వంటి అసమర్థ నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. స్థూల దేశీయోత్పత్తి క్షీణతపై అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపవు. దీనికి పూర్తిగా మోదీనే కారణం.''