లాక్డౌన్తో భారీగా దెబ్బతిన్న సేవా రంగం సెప్టెంబర్లో దాదాపు రికవరీ అయ్యింది. గత నెల సేవా రంగ కార్యకలాపాలు పుంజుకున్నట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదికలో తేలింది.
ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్లో సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 49.8గా నమోదైంది. ఆగస్టులో ఇది 41.8గా ఉంది. అయినప్పటికీ గత నెల కూడా పీఎంఐ.. సాధారణ స్థాయి కన్నా కాస్త తక్కువగానే నమోదైనట్లు నివేదిక తెలిపింది. పీఎంఐ 50కిపైగా ఉండే కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నట్లు భావించాలని వివరించింది.
సేవా రంగ వ్యాపార కార్యకలాపాల పీఎంఐ జులైలో 34.2గా, జూన్లో 33.7గా నమోదవడం గమనార్హం.