తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా దెబ్బ- ఏడాది కనిష్ఠానికి సేవా రంగం!

కరోనా మహమ్మారి సేవా రంగాన్ని కుదిపేస్తోంది. వరసగా రెండో నెల కూడా సేవా రంగ పీఎంఐ 50కి దిగువకు చేరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. కొవిడ్ ఆంక్షలతో వ్యాపార సెంటిమెంట్​ కూడా తగ్గినట్లు వివరించింది.

Corona impact on Service sector PMI
కరోనాతో సేవా రంగం కుదేలు

By

Published : Jul 5, 2021, 12:45 PM IST

దేశంలో సేవ రంగం జూన్​లో కూడా మరింత కుంగింది. కరోనా భయాలు, పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు, డిమాండ్ లేమి వంటివి ఇందుకు కారణంగా ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నెలవారి నివేదిక పేర్కొంది.

సేవ రంగ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 41.2గా నమోదైనట్లు తెలిపింది. మేలో ఇది 46.4గా ఉన్నట్లు వివరించింది. పీఎంఐ తగ్గటం వరుసగా ఇది రెండో నెల.

పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు, అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.

అంతర్జాతీయ డిమాండ్ లేమితో భారత సేవా రంగ ఎగుమతులు వరుసగా 16వ నెల కూడా తక్కువగానే నమోదైనట్లు పేర్కొంది నివేదిక.

కరోనా వల్ల వ్యాపార సెంటిమెంట్ వరుసగా మూడో నెల కూడా తగ్గినట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నివేదిక పేర్కొంది. గత ఏడాది ఆగస్టు తర్వాత తిరిగి 2021 జూన్​లోనే కనిష్ఠ స్థాయికి చేరినట్లు తెలిపింది.

ఇదీ చదవండి:Petrol price: ఆగని పెట్రో బాదుడు- ఎంత పెరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details