తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్చిలో సేవా రంగం డీలా- కారణమిదే!

మార్చిలో సేవా రంగ కార్యకలాపాలు కాస్త తగ్గాయి. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా సేవా రంగ పీఎంఐ గత నెల 54.6కి తగ్గినట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నివేదిక వెల్లడించింది.

services sector activities ease in March
సేవా రంగ పీఎంఐపీ కరోనా ప్రభావం

By

Published : Apr 7, 2021, 2:15 PM IST

Updated : Apr 8, 2021, 6:10 AM IST

కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటం భారత సేవారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చిలో సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 54.6కి పడిపోయినట్లు ఐహెచ్​ఎస్​​ మర్కిట్ నెలవారీ​ నివేదికలో వెల్లడైంది. ఫిబ్రవరిలో ఇది 55.3గా నమోదైంది. అయినప్పటికీ వరుసగా ఆరో నెలలోనూ సేవా రంగ పీఎంఐ సానుకూలంగా నమోదవడం గమనార్హం.

పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు, అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.

కరోనా కేసులు పెరుగుతుండటం, పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటం వల్ల ఏప్రిల్​లో సేవా రంగం ఇంకాస్త ఒత్తిడి ఎదుర్కోవచ్చని అంచనా వేసింది నివేదిక.

సేవ, తయారీ రంగాల సంయుక్త పీఎంఐ మార్చిలో 56కు తగ్గినట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నివేదిక పేర్కొంది. ఇది ఫిబ్రవరిలో ఇది 57.3గా ఉన్నట్లు వివరించింది.

ఇదీ చదవండి:7 నెలల కనిష్ఠానికి తయారీ రంగ కార్యకలాపాలు!

Last Updated : Apr 8, 2021, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details