అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) 2019, 2020 సంవత్సరాలకు వృద్ధి రేటు అంచనాలను విడుదల చేసింది. 2018లో 7.1శాతంగా ఉన్న భారత దేశ ఆర్థిక వృద్ధిరేటు 2019లో 7.2శాతానికి, 2020లో 7.5శాతానికి పెరుగుతుందని లెక్కగట్టింది.
పెట్టుబడులు పుంజుకోవడం, డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని వివరించింది ఐఎంఎఫ్.
చైనా వృద్ధి అంచనాలు తగ్గింపు
భారత్తో పోల్చితే చైనా ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండనున్ననట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది.
2018లో 6.6శాతంగా ఉన్న చైనా వృద్ధిరేటు... 2019లో 6.3శాతానికి, 2020లో 6.1శాతానికి క్షీణిస్తుందని అంచనా వేసింది.