తెలంగాణ

telangana

ETV Bharat / business

'వచ్చే రెండేళ్లలో తగ్గనున్న భారత వృద్ధిరేటు'

వచ్చే రెండేళ్లలో భారత వృద్ధిరేటు తగ్గిపోనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. 2019, 20 ఆర్థిక సంవత్సరాల్లో ముందు ప్రకటించిన వృద్ధిరేటు కన్నా 0.3 శాతం తక్కువగా నమోదు కానుందని పేర్కొంది.

By

Published : Jul 24, 2019, 7:20 AM IST

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక

వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలలో భారత వృద్ధిరేటు మందగించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2019, 2020 ఆర్థిక సంవత్సరాలలో దేశ జీడీపీ వృద్ధిరేటు ముందు ప్రకటించిన దానికంటే 0.3 శాతం మేర తగ్గించింది ఐఎంఎఫ్.

తగ్గినా మనమే టాప్​..

ఈ మేరకు భారత్‌ 2019లో 7 శాతం, 2020 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని ఐఎంఎఫ్​ పేర్కొంది. వృద్ధి రేటు తగ్గినప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ తన స్థానాన్ని పదిలం చేసుకుందని స్పష్టం చేసింది.

మందగించిన చైనా వృద్ధి

పక్క దేశం చైనాలో కూడా వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో లేదని తెలిపింది. అంతర్జాతీయంగా డిమాండ్‌ పడిపోవటం, సుంకాల పెరుగుదల వంటి కారణాల వల్ల చైనాలో వృద్ధి మందగించిందని పేర్కొంది. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం ప్రపంచ వృద్ధిరేటుపై పడిందని ఐఎంఎఫ్​ తెలిపింది.

రానున్న రెండేళ్లలో ముందుగా అంచనావేసిన దానికంటే 0.1 శాతం చొప్పున వృద్ధి రేటు తగ్గించింది. 2019లో 3.2 శాతం, 2020లో 3.5 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది. చైనా అమెరికాలు పరస్పరం సుంకాలు విధించుకోవడం వల్ల 2020 లో ప్రపంచ జీడీపీకి 0.5 శాతం నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చూడండి: విద్యుత్ వాహనాలపై జీఎస్టీ తగ్గేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details