భారతదేశ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. 2022-23 సంవత్సరంలో వృద్ధిరేటు 8.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే, ప్రపంచ వృద్ధిరేటు 6 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.
మార్చి - మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో దేశంలో వృద్ధి అవకాశాలు మందగించాయని, ఆ దెబ్బ నుంచి నెమ్మదిగా కోలుకుంటోందని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో తాజాగా ఐఎంఎఫ్ విశ్వాసం వ్యక్తంచేసింది.