తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో రేపు నిర్మల భేటీ - బ్యాంకుల సీఈఓలతో నిర్మలా భేటి

కరోనా సంక్షోభం, ఆర్థిక వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో నిర్మలా సీతారామన్ రేపు చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో భేటీ కానున్నారు ఆర్థిక మంత్రి.

Nirmala meet with bankers
బ్యాంకర్ల రేపు సీతమ్మ భేటీ

By

Published : May 10, 2020, 3:31 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు భేటీ కానున్నారు. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో రుణ చెల్లింపులపై బ్యాంకులు విధించిన 3 నెలల మారటోరియం సహా దీర్ఘకాలిక రుణాల పురోగతిని సమీక్షించనున్నారు.

రుణ వితరణపై సూచనలు..

ఇప్పటికే ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై చిన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్​ఎంఈ)లకు రుణ వితరణపై పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లతో సమావేశమవుతున్న నిర్మలా సీతారామన్‌.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్​బీఎఫ్​సీ), సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్​ఐ) ఆర్థిక పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ ఆర్థిక సంస్థలు ఎంఎస్​ఎంఈలకు ప్రధాన రుణ దాతలుగా ఉన్నాయి.

రూ.200 కోట్ల వరకు రుణాలు..

ఎన్​బీఎఫ్​సీలు, ఎంఎఫ్​ఐలు బ్యాంకుల నుంచి గరిష్ఠంగా రూ.200కోట్ల వరకు రుణాలు పొందవచ్చు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు రూ.42వేల కోట్ల మేర ఎంఎస్​ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి.

ఇదీ చూడండి:ఆ వివరాలు గోప్యంగా ఉంచితేనే మీరు సేఫ్!

ABOUT THE AUTHOR

...view details