కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా ఆర్థిక కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బడ్జెట్ ముద్రణకు ముందు సంప్రదాయం..
బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతి ఏటా ఈ హల్వా ఉత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఒక పెద్ద కడాయిలో హల్వా తయారు చేసి అందరికీ పంచుతారు. నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖలో ఈ వేడుక జరుగుతుంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న పద్దు ప్రవేశపెట్టనునుంది కేంద్రం. ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.