భారత ఎగుమతులు ఈ నెల తొలి వారంలో భారీగా 52.39 శాతం పెరిగాయి. జూన్ 1-7 మధ్య 7.71 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ద్వారా తెలిసింది. ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరగటం ఇందుకు ప్రధాన కారణంగా వెల్లడైంది.
ఇదే సమయానికి దిగుమతులు కూడా 83 శాతం పెరిగి.. 9.1 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం.
ఎగుమతి, దిగుమతులు ఇలా..
ఇంజనీరింగ్ ఉత్పతులు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు వరుసగా.. 59.7 శాతం (741.18 మిలియన్ డాలర్లు), 96.38 శాతం (297.82 మిలియన్ డాలర్లు), 69.53 శాతం (530.62 మిలియన్ డాలర్లు) పెరిగాయి.