తెలంగాణ

telangana

ETV Bharat / business

'వచ్చే ఏడాది భారత ఆర్థిక వృద్ధి రేటు 3.5 శాతమే'

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు దేశంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా భారత వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని క్రిసిల్ అంచనావేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 3.5 శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది.

gdp
జీడీపీ

By

Published : Mar 27, 2020, 5:29 AM IST

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్‌. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత వృద్ది రేటు 3.5 శాతానికే పరిమితం కావచ్చని తాజా అంచనాల్లో తెలిపింది. ఇంతకు ముందు అంచనాల్లో భారత్‌ 5.2 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని క్రిసిల్ పేర్కొనడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఆపత్కాలంలో ఆదుకునేందుకు ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని క్రిసిల్ స్వాగతించింది.

2008 మాంద్యానికి మించి..

కరోనా వల్ల ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులు 2008 నాటి లెహ్మాన్‌ బ్రదర్స్ సంక్షోభం లాంటిది మాత్రమే కాదని.. ఇందులో శతాబ్దంలోనే చూడని మనుషుల బాధలు ఉన్నాయని తెలిపింది.

కరోనా కారణంగా విధించిన ఆంక్షలు 2020-21 తొలి త్రైమాసికంపై తీవ్ర ప్రభావం చూపుతాయని క్రిసిల్‌ అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలపైనా ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. భయాందోళనలో జరుపుతున్న కొనుగోళ్ల కారణంగా రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం పెరగొచ్చని అంచనా వేసింది క్రిసిల్. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ధరలు కాస్త తగ్గే అవకాశముందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details