తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్లు యథాతథం

వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్​ రిజర్వు యథాతథంగా ఉంచింది. సమీప భవిష్యత్తులో మార్పు ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇచ్చింది.

అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్లు యథాతథం

By

Published : May 2, 2019, 10:52 AM IST

Updated : May 2, 2019, 11:08 AM IST

అమెరికాలోని కేంద్ర బ్యాంకైన ఫెడరల్​ రిజర్వు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. సమీప భవిష్యత్తులోనూ యథాతథంగా ఉంటాయనే సంకేతాలు ఇచ్చింది. ఆర్థిక వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండటం సహా అల్ప ద్రవ్యోల్బణం కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడ్​ ఛైర్మన్​ జెరోమ్​ పావెల్​ తెలిపారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ దిశను నిర్దేశించటం సహా వివిధ దేశాలను ప్రభావితం చేసే ఈ వడ్డీ రేట్లు ప్రస్తుతం 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకు ఉన్నాయి.

మాట్లాడుతోన్న ఫెడరల్​ రిజర్వు ఛైర్మన్​ జెరోమ్​ పావెల్​

ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలోనే ఉంది. ప్రస్తుత ద్రవ్యపరపతి విధానం సరైనదని కమిటీ భావించింది. బలమైన ఆర్థిక మూలాలు వ్యవస్థను మద్దతిస్తున్నట్లు కమిటీ భావించింది. ఇందులో మంచి ఆర్థిక పరిస్థితి, అధిక ఉద్యోగ వృద్ధి, వేతనాల పెరుగుదల, వినియోగదారుల సెంటిమెంట్​ బలంగా ఉండటం వంటివి ఉన్నాయి.
- జెరోమ్​ పావెల్​, ఫెడరల్​ రిజర్వు ఛైర్మన్​

ద్రవ్యోల్బణం పెంచటంలో విఫలం....

ప్రస్తుతం వార్షిక ద్రవ్యోల్బణం 1.5 శాతంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఫెడ్​ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని నిపుణులు వేసిన అంచనా తలకిందులైంది. 2 శాతం ద్రవ్యోల్బణం సాధించాలన్న లక్ష్యాన్ని అందుకోవటంలో ఇంకా విఫలమవుతూనే ఉన్నట్లు ఫెడ్​ ప్రకటన ద్వారా స్పష్టమైంది.

అంతకుముందు... ఫెడ్​ వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచుతుందని ట్రంప్​ ట్విట్టర్​ వేదికగా ఆగ్రహించారు. అల్ప వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థ లాభపడుతుందని విశ్లేషించారు.

Last Updated : May 2, 2019, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details