తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్తగా 20 విమాన సర్వీసులు: స్పైస్​ జెట్​ - స్పైస్ జెట్

వేసవి ప్రణాళికల్లో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​ జెట్​ కొత్త సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. నూతన సర్వీసుల్లో కొన్నింటిని కేంద్రం తీసుకొచ్చిన ప్రాంతీయ అనుసంధాన పథకం-ఉడాన్​కు కేటాయించనున్నట్లు తెలిపింది.

SPICEJET
స్పైస్ జెట్​

By

Published : Feb 19, 2020, 1:47 PM IST

Updated : Mar 1, 2020, 8:16 PM IST

దేశీయ మార్గాల్లో మరో 20 కొత్త సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​జెట్​ ప్రకటించింది. మార్చి 29న నూతన దేశీయ​ సర్వీసులకు పచ్చజెండా ఊపనున్నట్లు స్పష్టం చేసింది. పట్నా, అమృత్​సర్​, వారణాసి, గువాహాటి పట్టణాల్లో సేవలందిస్తాయని పేర్కొంది.

ఇందులో కొన్నింటిని ప్రాంతీయ అనుసంధాన పథకం(ఆర్​సీఎస్​)-ఉడాన్​కు కేటాయిస్తామని తెలిపింది. అందులో భాగంగా హైదరాబాద్​-మంగళూరు, బెంగళూరు-జబల్​పుర్​, ముంబయి-ఔరంగాబాద్​ తదితర మార్గాల్లో నడపనున్నట్లు పేర్కొంది.

కొత్త విమానాలతో ఆర్​సీఎస్​ కింద స్పైస్ సేవలు 52 సర్వీసులతో 12 ప్రాంతాలకు విస్తరించనున్నాయి. నూతన సర్వీసుల్లో బోయింగ్​ 737-800, బాంబార్డియర్​ క్యూ400 విమానాలను ఉపయోగిస్తామని స్పైస్​ జెట్​ తెలిపింది.

Last Updated : Mar 1, 2020, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details