తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లు: హమ్మయ్యా ఎట్టకేలకు లాభాలొచ్చాయ్​ - నేటి స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 137 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 62 పాయింట్లు వృద్ధి చెందింది.

STOCKS
స్టాక్ మార్కెట్లు

By

Published : Feb 3, 2020, 4:15 PM IST

Updated : Feb 29, 2020, 12:40 AM IST

బడ్జెట్​ నిరాశల నుంచి స్టాక్ మార్కెట్లు నేడు తేరుకున్నాయి. సెషన్ ఆరంభంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. చివరకు లాభాలతో ముగిశాయి సూచీలు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 137 పాయింట్లు వృద్ధితో 39,872 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 11,724 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,015 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 39,563 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,750 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,614 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

ఏషియన్​ పెయింట్స్ 6.32, నెస్లే 5.30, హెచ్​యూఎల్​ 5.06, బజాజ్ ఆటో 4.71, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు 4.29 శాతం లాభాపడ్డాయి.

ఐటీసీ 5.09, టీసీఎస్​ 2.86, హెచ్​సీఎల్​టెక్​ 2.04, హీరోమోటోకార్ప్ 1.95, టెక్​ మహీంద్రా షేర్లు 1.88 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి:హ్యుందాయ్​ రెండోతరం 'క్రెటా' వచ్చేది అప్పుడే!

Last Updated : Feb 29, 2020, 12:40 AM IST

ABOUT THE AUTHOR

...view details