తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాల్లోంచి తేరుకుని లాభాలవైపు మార్కెట్ల పరుగు

కరోనా వైరస్​ భయాలతో గత రెండు సెషన్లలో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు కాస్త తేరుకున్నట్లు కనిపిస్తోంది. సెన్సెక్స్ 261 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ 86 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది.

STOCKS
స్టాక్​ మార్కెట్లు

By

Published : Jan 29, 2020, 10:00 AM IST

Updated : Feb 28, 2020, 9:10 AM IST

స్టాక్​ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. మెజారిటీ షేర్లు సానుకూలంగా కొనసాగుతున్న నేపథ్యంలో సూచీలు భారీ లాభాల దిశగా పరుగుతీస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 261 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 41,228 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 86 పాయింట్లకు పైగా వృద్ధితో 12,142 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

30 షేర్ల ఇండెక్స్​లో దాదాపు అన్ని కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్​, ఎం&ఎం, భారతీ ఎయిర్​టెల్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:ఉద్యోగ, వ్యక్తిగత జీవిత సమతుల్యమే కీలకపాత్ర..!

Last Updated : Feb 28, 2020, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details