వస్తుసేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించిన వివాదాస్పదమైన అంశాలపై విచారణకు సుప్రీంకోర్డు అంగీకరించింది. పన్ను శాఖ అధికారాలైన జీఎస్టీ ఎగవేతదార్ల అరెస్టు, విచారణ వంటి అంశాలపై విచారణ చేపట్టనుంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాల్గు వారాల్లోగా స్పందించాలని సూచించింది.
జీఎస్టీ ఎగవేతదార్లపై కేసుల్లో పలు హైకోర్టులకు వేరు వేరు రకాల ఆభిప్రాయాలున్నాయని.. అయితే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం పేర్కొంది.
అన్ని హైకోర్టులు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే జీఎస్టీ ఎగవేత కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసే అంశాలను పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.