తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ2లో ఎస్​బీఐ నికర లాభం 55 శాతం జంప్

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.5,245.88 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయం రూ.95,373.50 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.

FY21 Q2 SBI PROFIT
రెండో త్రైమాసికంలో ఎస్​బీఐ లాభం

By

Published : Nov 4, 2020, 3:26 PM IST

అతిపెద్ద దేశీయ బ్యాంక్.. ఎస్​బీఐ 2020-21 రెండో త్రైమాసిక ఏకీకృత నికర లాభం 55 శాతం పెరిగింది. మొత్తం రూ.5,245.88 కోట్లు గడించినట్లు బుధవారం ప్రకటించింది.

క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంక్ నికర లాభం రూ.3,375.40 కోట్లుగా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో మొత్తం ఆదాయం కూడా రూ.95,373.50 కోట్లకు పెరిగినట్లు తెలిపింది ఎస్​బీఐ. 2019-20 ఇదే సయమయంలో బ్యాంక్ ఆదాయం రూ.89,347.91 కోట్లుగా నమోదైంది.

ఈ ఏడాది సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి స్థూల నిరర్ధక ఆస్తులు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. 7.19 శాతం నుంచి 5.28 శాతానికి తగ్గినట్లు ఎస్​బీఐ వివరించింది. ఇదే కాలానికి నికర నిరర్ధక ఆస్తులు కూడా 2.79 శాతం నుంచి 1.59 శాతానికి చేరినట్లు పేర్కొంది.

ఒంటరి ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 2020-21 క్యూ2లో 52 శాతం పెరిగి రూ.3,011.73 కోట్ల నుంచి రూ.4,574,16 కోట్లకు చేరింది. ఆదాయం రూ.72,850.78 కోట్ల నుంచి రూ.75,341.80 కోట్లకు పెరిగింది.

ఇదీ చూడండి:అప్పులే శరణ్యంగా సగం కుటుంబాల జీవనం!

ABOUT THE AUTHOR

...view details