తెలంగాణ

telangana

ETV Bharat / business

శాంసంగ్ గెలాక్సీ ఏ10 ఎస్ ఫీచర్లు ఇవే!

గెలాక్సీ ఏ10కు కొనసాగింపుగా మరో ఫోన్​ను మార్కెట్లోకి తీసుకురానుంది శాంసంగ్. గెలాక్సీ ఏ10ఎస్ పేరుతో రానున్న ఈ ఫోన్​ ఫీచర్లు అంతర్జాలంలో లీకయ్యాయి. మరి ఆ ఫీచర్లు ఏంటో మీరు చూసేయండి.

By

Published : Jul 27, 2019, 3:39 PM IST

శాంసంగ్ గెలాక్సీ

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్... భారత మార్కెట్లోకి బడ్జెట్​ ఫోన్​ను తీసుకురానుంది. గెలాక్సీ ఏ10 ఎస్​ పేరుతో మార్కెట్లోకి రానుంది ఈ కొత్త ఫోన్​. కొత్త మోడల్ ఫీచర్లపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవలే లీకైన కొన్ని ఫీచర్లు అంతర్జాలంలో హల్ చల్ చేస్తూ ఫోన్​పై అంచనాలు పెంచుతున్నాయి.

రెడ్ మీ 7, రియల్ మీ 3 స్మార్ట్ ఫోన్లకు పోటీగా శాంసంగ్ గెలాక్సీ ఏ10 ఎస్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ధరతో పాటు ఫీచర్ల విషయంలోనూ ఈ ఫోన్లకు పోటీ ఇవ్వనుంది​. 2 జీబీ ర్యామ్/16 జీబీ రోమ్, 3 జీబీ ర్యామ్/32 జీబీ రోమ్ రెండు వేరియంట్లతో ఈ మోడల్​ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ.8,990గా ఉండొచ్చని అంచనా. వచ్చే నెలలో ఈ కొత్త ఫోన్​ విడుదలయ్యే అవకాశం ఉంది.

లీకైన మరిన్ని ఫీచర్లు:

  • 6.2 అంగుళాల హెచ్​డీ+ డిస్​ప్లే
  • 13 ఎంపీ+2ఎంపీలతో వెనుకవైపు రెండు కెమెరాలు
  • ముందువైపు 8 ఎంపీ కెమెరా
  • మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్​ 9 ఆధారంగా పని చేసే శాంసంగ్ వన్​యూఐ ఓఎస్.
  • 4000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • డిస్​ప్లేపై ఫింగర్​ప్రింట్ సెన్సర్

ఇదీ చూడండి: విద్యుత్​ వాహనాలపై జీఎస్​టీ 5 శాతానికి తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details