తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్దేశపూర్వక ఎగవేతదారుల్లో మెహుల్ ఛోక్సీ కంపెనీ నెం.1 - బిజినెస్ వార్తలు తెలుగు

దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల జాబితాను ఇటీవల విడుదల చేసింది ఆర్​బీఐ. సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన ఓ దరఖాస్తుకు సమాధానంగా లిస్ట్​ ప్రకటించింది. వాటిలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ ప్రథమ స్థానంలో ఉంది.  అ ఒక్క కంపెనీనే సుమారు రూ.5,044 కోట్ల రుణాలు ఎగవేసినట్లు జాబితాలో ఆర్బీఐ పేర్కొంది.

మోహుల్ ఛోక్సీ

By

Published : Nov 23, 2019, 8:01 PM IST

భారతీయ రిజర్వు బ్యాంకు ఎట్టకేలకు తొలిసారి... ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల జాబితాను విడుదల చేసింది. ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానంగా ఈ సమాచారాన్ని ఇచ్చింది ఆర్​బీఐ.

ఈ జాబితాలో మొత్తం 30 కంపెనీల పేర్లను వెల్లడించింది రిజర్వు బ్యాంకు. వాటిలో చాలా వరకు అందరికీ సుపరిచితమైన కంపెనీలే ఉన్నాయి. ఈ జాబితాలో మెహుల్ ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.5,044 కోట్ల మొండి బకాయిలతో ప్రథమ స్థానంలో ఉంది.

బ్యాంకుల కేసులతో పేర్లు బయటికి..

ఆర్‌బీఐ ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల పేర్లను వెల్లడించడానికి నిరాకరిస్తూ వచ్చినా.. బ్యాంకులు తమకు బకాయిలు చెల్లించడంలో విఫలమయ్యాయంటూ కేసులు వేయడం జరిగింది. ఫలితంగా అప్పుడప్పుడు కొందరి పేర్లు బయటకు వచ్చాయి. మరోవైపు ‘ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌’ కూడా గత కొన్నేళ్లుగా ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సమాచారంపై పనిచేస్తోంది. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ సమాచారం ప్రకారం.. 2018 డిసెంబరు నాటికి 11,000కి పైగా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టినట్లు సమాచారం. ఇవి మొత్తంగా చెల్లించాల్సిన బకాయిల విలువ రూ.1.61 లక్షల కోట్లకు పైనే.

స్తోమత ఉన్నా.. అప్పు తిరిగి చెల్లించకపోతే..

ఆర్‌బీఐ నిర్వచనం ప్రకారం.. స్తోమత ఉన్నప్పటికీ.. అప్పును చెల్లించకుంటే ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పరిగణిస్తారు. అలాగే ఒక అవసరం కోసం తీసుకున్న రుణాన్ని వేరే వాటి కోసం మళ్లించి ఆ రుణాన్ని తిరిగి చెల్లించకుంటే కూడా ఆ ప్రమోటరు లేదా కంపెనీ ఉద్దేశపూర్వక ఎగవేతదారు కిందకు వస్తుంది.

సీఆర్‌ఐఎల్‌సీ సమాచారం ఆధారంగా జాబితా..

కేంద్రీకృత బ్యాంకింగ్‌ వ్యవస్థ సమాచారగనిగా వ్యవహరించే సీఆర్‌ఐఎల్‌సీ (ద సెంట్రల్‌ రిపాజిటరీ ఆఫ్​ ఇన్‌ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్స్‌) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆర్‌బీఐ తాజా జాబితా విడుదల చేసింది. రూ.5 కోట్లు అంతకుమించి అప్పు తీసుకున్న రుణగ్రహీతల రుణ సమాచారమంతా సీఆర్‌ఐఎల్‌సీలో ఉంటుంది.

ఆర్​బీఐ జాబితా..

ఎగవేతదారు బకాయిలు (రూ.కోట్లలో)

  1. గీతాంజలి జెమ్స్ 5,044
  2. రీ ఆగ్రో లిమిటెడ్​ 4,197
  3. విన్​సమ్ డైమండ్స్ 3,386
  4. రుచి సోయా ఇండస్ట్రీస్ 3,225
  5. రోటోమాక్​ గ్లోబర్​ 2,844
  6. కింగ్​ఫిషర్ ఎయిర్​లైన్స్ 2,488
  7. కుడోస్ కెమిలిమిటెడ్​ 2,326
  8. జూమ్​ డెవలపర్స్​ 2,024
  9. డెక్కన్​ క్రానికల్​ హోల్డింగ్స్​ 1,951
  10. ఏబీజీ షిప్​యార్డ్​ 1,875
  11. ఫరేవర్​ ప్రీషియస్ జువెలరీ 1,718
  12. సూర్య వినాయక్ ఇండస్ట్రీస్​ 1,628
  13. ఎస్​కుమార్​ నేషన్​వైడ్​ 1,581
  14. గిలి ఇండియా 1,447
  15. సిద్ధి వినాయక్ లాజిస్టిక్స్ 1,349
  16. విఎంసీ సిస్టమ్స్ 1,314
  17. గుప్తా కోల్​ ఇండియా 1,235
  18. నక్షత్ర బ్రాండ్స్​ 1,148
  19. ఇండియన్ టెక్నో మ్యాక్​ 1,091
  20. శ్రీ గణేశ్​ జువెలరీ 1,085
  21. జైన్​ ఇన్​ఫ్రా 1,076
  22. సూర్య ఫార్మస్యూటికల్ 1,065
  23. నకోడా 1,028
  24. కేఎస్​ ఆయిల్స్ 1,026
  25. కోస్టల్​ ప్రాజెక్ట్స్​ 984
  26. హాంగ్​ టాయ్స్​&టెక్స్​టైల్స్​ 949
  27. ఫస్ట్​ లీజింగ్​ కంపెనీ 929
  28. కాన్​కాస్ట్​ స్టీల్ & పవర్ 888
  29. యాక్షన్​ ఇస్పాత్​ ​ 888
  30. డైమండ్​ పవర్​ ​ 869

ఇదీ చూడండి:మనోళ్లు.. స్మార్ట్​ ఫోన్లతోనే ఎక్కువగా కొనేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details