ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 3,802 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోల్చితే ఇది 5.2శాతం అధికం. గతేడాది ఇదే సమయానికి రూ. 3,612 కోట్ల లాభం ఆర్జించింది ఇన్ఫోసిస్.
ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక లాభం రూ.3,802 కోట్లు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ. 3,802 కోట్ల లాభం గడించింది. ఇదే సమయంలో సంస్థ మొత్తం ఆదాయం రూ. 21,803 కోట్లుగా నమోదైంది.
ఇన్ఫోసిస్
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ 2019-20 క్యూ1లో రూ. రూ. 21,803 కోట్ల ఆదాయం గడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో కంపెనీ ఆదాయం రూ.19,128 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పొందిన ఆదాయం 13.9 శాతం అధికం.
ఇదీ చూడండి: గూగుల్ అసిస్టెంట్‌తో మీ సంభాషణలు లీక్!