మరో ఆరు విదేశీ గమ్యస్థానాలకు ఇండియా పోస్ట్ సేవలు విస్తరించింది. ఆసియా, ఐరోపా, దక్షిణ అమెరికాలోని.. బోస్నియా అండ్ హెర్జ్గొవినా, బ్రెజిల్, ఈక్వెడార్, కజికిస్థాన్, లిథువేనియా, నార్త్ మాసిడోనియా దేశాలకు ఈ స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా పోస్ట్ వెల్లడించింది.
స్పీడ్ పోస్ట్ లేదా ఎక్స్ప్రెస్ మెయిల్ అనేది ప్రీమియం సర్వీస్. ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు డాక్యుమెంట్లు, వస్తువులను వేగంగా.. కావాల్సిన గమ్యస్థానాలకు పంపించవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు అంతర్జాలం ద్వారా ఎక్కడ ఉందో ట్రాక్ చెసే సదుపాయాన్నీ అందించనున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది.