లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని సంస్థల ప్యాసింజర్ విమానాలు నేలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్ పొడిగింపుతో మే 3 వరుకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది ప్రముఖ బడ్డెట్ విమానయాన సంస్థ గో ఎయిర్. దాదాపు 5,500 మంది ఉద్యోగులను మే 3 వరకు వేతనాలు లేని సెలవులపై పంపేందుకు సిద్ధమైంది.
అయితే ప్రస్తుతానికి సంస్థ కార్యకలాపాలు లేనప్పటికీ దాదాపు 5,500 ఉద్యోగుల్లో 10 శాతం మందిని.. కచ్చితంగా నిర్వహించాల్సిన కొన్ని కార్యకలాపాలకు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. వారికి నామమాత్రపు వేతనాలు చెల్లించనున్నట్లు వెల్లడించింది.
వాడియా గ్రూప్‌నకు చెందిన గోఎయిర్ సంస్థ మార్చిలోనూ ఉద్యోగులకు వేతనాలు లేని సెలవులు తీసుకోమని కోరింది.
ఆశలన్నీ మే 4పైనే..