భారత్లో హోల్‌సేల్ వ్యాపారాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో.. ఇటీవలే 'వాల్మార్ట్ ఇండియా'ను కొనుగోలు చేసి 'ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్' అనే పేరుపెట్టింది ఫ్లిప్‌కార్ట్. తాజాగా.. మూడు నగరాల్లో కార్యకలాపాలను ప్రారంభించింది 'ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్'. స్థానిక తయారీదారులను రిటైలర్లతో అనుసంధానించనున్నట్టు పేర్కొంది.
అమెజాన్, ఉడాన్ వంటి ప్రత్యర్థులతో పోటీపడటానికి ఈ చర్యలు ఉపయోగపతాయని సంస్థ భావిస్తోంది.
"ముందుగా ఫ్యాషన్(ఫుట్వేర్, యాక్ససరీస్)తో మొదలుపెడుతున్నాం. గురుగ్రామ్, దిల్లీ, బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించాం. ఈ ఏడాది చివరి నాటికి ఇంకో 20 నగరాలకు కార్యకలాపాలను విస్తరిస్తాం. గృహోపకరణాలు, కిరాణాను కూడా జోడిస్తాం."