తెలంగాణ

telangana

ETV Bharat / business

కలిసిరాని ప్రత్యేక ట్రేడింగ్​- కుప్పకూలిన మార్కెట్లు - స్టాక్ మార్కెట్ వార్తలు

బడ్జెట్​పై భారీ అంచనాలతో సెలవురోజూ పనిచేసిన స్టాక్​ మార్కెట్లు చివరకు నిరశ మిగిల్చాయి. సెన్సెక్స్ 988 పాయింట్లు క్షీణించి.. 40 వేల మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ 318 పాయింట్లు నష్టంతో కీలక 12 వేల స్థాయి దిగువకు చేరింది.

Sensex
కుప్పకూలిన మార్కెట్లు

By

Published : Feb 1, 2020, 5:45 PM IST

Updated : Feb 28, 2020, 7:15 PM IST

బడ్జెట్​ ప్రత్యేక సెషన్​లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మదుపరులు ఆశించినట్లు కేంద్ర బడ్జెట్​లో సంస్కరణలు లేకపోవడం కారణంగా బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 988 పాయింట్లు క్షీణించి 39,735 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి 11,662 వద్ద ముగిసింది.

రికార్డు స్థాయి నష్టాలతో మదుపర్ల సంపద ఈ ఒక్కరోజే 3.46 లక్షల కోట్లు ఆవిరైంది.

పద్దు నిరాశలు...

ఆదాయపు పన్ను పరిమితి పెంపు, స్లాబులను సవరించినప్పటికీ.. దీన్ని ఐచ్ఛికంగా నిర్ణయించింది కేంద్రం. ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో భారీ ఊరటనిచ్చే దిశగా బడ్జెట్​లో చర్యలు ఉంటాయని భావించిన మదుపరులకు ఈ అంశం తీవ్ర నిరాశ కలిగించింది. ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తి.. మార్కెట్లు రికార్డుస్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,906 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 39,631 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,017 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,639 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

టీసీఎస్​ 4.13 శాతం, హెచ్​యూఎల్​ 1.94 శాతం, నెస్లే ఇండియా 1.68 శాతం, టెక్​ మహీంద్రా 1.52 శాతం, ఇన్ఫోసిస్ 0.50 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 0.13 శాతం లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ 6 షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

ఐటీసీ 6.97 శాతం, ఎల్​&టీ 5.98 శాతం, హెచ్​డీఎఫ్​సీ 5.87 శాతం, ఎస్​బీఐ 4.83 శాతం, ఓఎన్​జీసీ 4.18 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 4.01 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:'ఉద్యోగాల భర్తీకి జాతీయస్థాయి రిక్రూట్​మెంట్​ ఏజెన్సీ'

Last Updated : Feb 28, 2020, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details