దేశంలో 4జీ నెట్వర్క్ విస్తరణ సహా, నెట్వర్క్ నాణ్యత పెంపునకు టెలికాం ఉపకరణాల తయారీ సంస్థ నోకియాతో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం విలువ సుమారు రూ.7,500 కోట్లుగా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
నోకియా, ఎయిర్టెల్ కొత్త స్కెచ్- రూ.7,500 కోట్లకు డీల్
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, టెలికాం ఉపకరణాల తయారీ సంస్థ నోకియా మధ్య రూ.7,500 కోట్ల భారీ ఒప్పందం కుదిరింది. 4జీ నెట్వర్క్ విస్తరణలో భాగంగా నోకియాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది.
దేశంలోని తొమ్మిది సర్కిళ్లలో సింగిల్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఎస్ఆర్ఏఎన్) సర్వీసులు అందించేందుకు నోకియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. భవిష్యత్‌లో 5జీ నెట్వర్క్అందించేందుకు ఈ ఒప్పందం ద్వారా పునాది పడినట్లు తెలిపింది. ఈ డీల్‌తో తొమ్మిది సర్కిళ్లలో 300,000 రేడియో యూనిట్లను వివిధ స్పెక్ట్రమ్ బ్యాండ్లలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 2022 వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎయిర్టెల్ వివరించింది.
ఇదీ చూడండి:70 శాతం తగ్గిన వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు