ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ప్రముఖ టెక్ ఇన్వెస్టర్ సిల్వర్ లేక్ జియోలో రూ.5,655.75 కోట్లతో 1.15 శాతం వాటా కొనుగోలుకు చేయనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం పూర్తయినట్లు తెలిపింది.
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ ఇటీవలే రూ.43,574 కోట్లతో జియోలో 9.99 శాతం వాటా కొనుగోలు చేసింది.