బడ్జెట్లో జువెలరీ రంగానికి బూస్ట్ ఇచ్చింది కేంద్రం. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పాలిష్ చేయని వజ్రాలకు ఎలాంటి దిగుమతి సుంకం ఉండదని చెప్పింది. ఈమేరకు పార్లమెంటులో బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే జువెలరీ ఎగుమతి కోసం ఈ కామర్స్ సదుపాయాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు.
జువెలరీ రంగానికి బూస్ట్.. దిగుమతి సుంకం తగ్గింపు
జువెలరీ రంగానికి ఊతం ఇచ్చేందుకు వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 5శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
జ్యువెలరీ రంగానికి బూస్ట్.. దిగుమతి సుంకం తగ్గింపు
అలాగే అధిక ధర కారణంగా కొన్ని స్టీల్ ఉత్పత్తులపై నిర్దిష్ట యాంటీ-డంపింగ్ సుంకం, CVD రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించాలని ప్రతిపాదించారు.
పెట్రోలు, డీజిల్‌లో జీవ ఇంధనాలను కలపడాన్ని ప్రోత్సహించడానికి అక్టోబర్ 1 నుంచి అన్బ్లండెడ్ ఫ్యూయల్స్‌పై లీటర్‌కు రూ.2 అదనపు ఎక్సైజ్ సుంకం వసూలు చేయనున్నట్లు నిర్మల పేర్కొన్నారు.
Last Updated : Feb 1, 2022, 4:05 PM IST