తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా 6.8 కోట్ల సిలిండర్లు!

కేంద్రం ప్రకటించిన గరీబ్ కల్యాణ్ యోజన కింద 6.8 కోట్ల సిలిండర్లను ఉచితంగా అందించినట్లు కేంద్రం తెలిపింది. 3 నెలలకు 24 కోట్ల సిలిండర్లు ఉచితంగా ఇస్తామని స్పష్టం చేసింది.

BIZ-VIRUS-UJJWALA PLAN-LPG
సిలిండర్లు

By

Published : May 22, 2020, 5:00 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఉచిత వంట గ్యాస్ పథకం ద్వారా భారీగా ప్రజలు లబ్ధి పొందారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు 8 కోట్ల మంది ఉండగా.. ఏప్రిల్​- మే నెలల్లో 6.8 కోట్ల సిలిండర్లను ఉచితంగా అందించినట్లు ప్రకటించింది ఇంధన మంత్రిత్వ శాఖ.

"2020 ఏప్రిల్​లో ఆయిల్ కంపెనీలు 4.53 కోట్ల సిలిండర్లను ఉజ్వల లబ్ధిదారులకు అందించారు. మే 20 నాటికి ఈ సంఖ్య 6.79 కోట్లకు చేరింది."

- ఇంధన మంత్రిత్వ శాఖ

కరోనా సంక్షోభం నేపథ్యంలో పేదలకు ఉపశమనం కలిగించేలా రూ.1.7 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని మార్చిలో ప్రకటించింది కేంద్రం. ఇందులో ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏప్రిల్​ నుంచి జూన్​ మధ్య కాలంలో 3 ఎల్​పీజీ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని స్పష్టం చేసింది.

జూన్​ వరకు మొత్తం 24 కోట్ల సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు రూ.13 వేల కోట్లు ఖర్చవుతుంది. అయితే ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే జూన్​ వరకు 14 కోట్లకు మించేలా లేవు.

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలకు వంటగ్యాస్ కనెక్షన్​ ఉచితంగా ఇవ్వాలని ఉజ్వల పథకాన్ని 2016లో ప్రారంభించింది మోదీ ప్రభుత్వం. ఈ పథకం కింద ఇప్పటివరకు 8 కోట్ల మంది లబ్ధి పొందారు.

ABOUT THE AUTHOR

...view details