అమెరికా-చైనా మొదటి దఫా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లకు ఊపొచ్చింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 42 వేల మార్కును అందుకుని ట్రేడవుతోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 129 పాయింట్లు లాభపడి 42 వేల 2 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 31 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 374 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
ఎస్ బ్యాంకు, నెస్లే, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్ప్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ రాణిస్తున్నాయి.
వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఎమ్ అండ్ ఎమ్, టాటా మోటార్స్ నేలచూపులు చూస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు